వరి వద్దంటే కాంగ్రెస్ కూడా వద్దు : కేంద్ర మంత్రి బండి సంజయ్

-

తెలంగాణ లో వరి  పంట వేయొద్దని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల  ప్రచారంలో భాగంగా వరంగల్ వచ్చిన బండి
సంజయ్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉపాధ్యాయ ఓటర్లతో సమావేశమయ్యారు. వర్షాలు
పుష్కలంగా పడి నదుల్లో నీళ్లున్నా.. కాంగ్రెస్ చేతగానితనంవల్ల ఆ నీళ్లు వాడుకోలేకపోయారని
మండిపడ్డారు. క్రిష్ణా నీటి ని పీపీకి కట్టబెట్టడంవల్ల దక్షిణ తెలంగాణ, కాళేశ్వరం ప్రాజెక్టు ను నాశనం చేయడంవల్ల నీళ్లు లేక ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతోందన్నారు.

కాంగ్రెస్ వల్ల నష్టపోతున్న రాష్ట్ర రైతులంతా.. వరి పంట వేయొద్దని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తమకొద్దు అని నినదిస్తున్నారని చెప్పారు. మేధావులైన గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్లంతా ప్రజలు పడుతున్న బాధలను అర్ధం చేసుకుని కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని కోరారు. MLC ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అభ్యర్థులు దొరక్క పోటీ నుంచి తప్పుకుంది అన్నారు. కాంగ్రెస్ బయటి నుంచి తెచ్చుకున్న అభ్యర్థిని పోటీ నిలిపిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news