ఇదేం కర్మ రా…ఒకే యువకుడిని ఇద్దరు ప్రేమించారు..చివరకు ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం నగరంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో ప్రేమ.. ఇద్దరు యువతుల ఆత్మహత్యా యత్నానికి దారి తీసింది. ఇన్‌స్టాగ్రామ్ లో శారద, రేష్మాకు పరిచయం అయ్యాడు దివాకర్ అనే వ్యక్తి. ఈ తరుణంలోనే… దివాకర్ ను ప్రేమించారు ఇద్దరు యువతులు శారద, రేష్మా.

దివాకర్ ప్రేమ విషయంలో ఇద్దరి యువతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆర్డీఓ కార్యాలయం సమీపంలో పురుగు మందు తాగారు శారద, రేష్మా. ఈ సంఘటన లో శారద మృతి చెందగా, వివాహిత రేష్మా పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లో ప్రేమ.. ఇద్దరు యువతుల ఆత్మహత్యా యత్నం
అనంతపురం నగరంలో ఘటన
ఇన్‌స్టాగ్రామ్ లో శారద, రేష్మాకు పరిచయం అయిన దివాకర్ అనే వ్యక్తి
దివాకర్ ను ప్రేమించిన ఇద్దరు యువతులు
దివాకర్ ప్రేమ విషయంలో ఇద్దరి యువతుల మధ్య ఘర్షణ
ఆర్డీఓ కార్యాలయం సమీపంలో పురుగు మందు తాగిన శారద,… pic.twitter.com/Exsg6rD2DH
— BIG TV Breaking News (@bigtvtelugu) February 24, 2025