రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాంలపై మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే… ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తోంది అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రం పరిధిలోనిది. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు స్కాంలు చేసింది రాష్ట్రంలోనే… దొచుకున్న సొమ్మంతా తెలంగాణ ప్రజలదే. విచారణ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే. కొంత మంది నిందితులను అరెస్ట్ చేసింది ప్రభుత్వమే. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకుని మీరేందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రాన్ని నిందించడం చూస్తుంటే నవ్వొస్తుంది.
ఆధారాలున్నాయని చెబుతూ రాధాకిషన్ రావుసహా కొందరు అధికారులను అరెస్ట్ చేసి 10 నెలలకుపైగా జైల్లో ఉంచిన మీరు కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు. పైకి తిడుతున్నట్లుగా ఉంటూ నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అరెస్ట్ కాకుండా కాపాడుతూ ఆయా కేసులను నీరుగారుస్తున్నది మీరు కాదా.. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ కేసులన్నీ సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయండి. ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి బొక్కలో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటది అని బండి తెలిపారు.