తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఇవాళ కూడా తెలంగాణలో కొన్ని విద్యాసంస్థలకు హాలిడే ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం స్పష్టంగా… ఉంది. పట్టభద్రులు అలాగే టీచర్స్ అసెంబ్లీ ఎన్నికలు… ఇవాళ జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ అలాగే ప్రవేట్ పాఠశాలలకు హాలిడే ప్రకటించారు.

నిన్న శివరాత్రి రోజున హాలిడే ఇచ్చినప్పటికీ… ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో… ఇవాళ కూడా 25 జిల్లాల్లో హాలిడే ప్రకటించారు. దీంతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉన్నాయ్.. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.