మే నెలలో ‘తల్లికి వందనం’ నిధులు విడుదల : సీఎం చంద్రబాబు

-

మే నెలలో ‘తల్లికి వందనం’ నిధులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా చిత్తూరు జిల్లా జీ నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీనీ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. ఏపీని వైసీపీ అప్పుల రాష్ట్రంగా మార్చిందని తెలిపారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ది జరుగుతుంది. ఐదేళ్లు వైసీపీ నేతలు దోచుకున్నారు. ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. ఇక్కడ మామిడితోట రూ.1కోటి ఖర్చు చేస్తారు. 

మూడింతలు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. రాబోయే రోజుల్లో పేదలందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తానని తెలిపినట్టు గుర్తు చేశారు. నేను వాడుకున్న కరెంట్ కాకుండా తిరిగి ఆదాయం వచ్చే పరిస్థితి నెలకొంది. మీ ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు అని తెలిపారు. రైతులకు మోటార్లున్నాయి. నేనే డబ్బులు ఇస్తా.. పెట్టుకున్న తరువాత కరెంట్ ఉపయోగించి మిషన్ ఆన్ చేయండి. ఉత్పత్తి చేిసినప్పుడల్లా మేము తీసుకుంటున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news