హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగిన ఆదిలాబాద్ లోక్ సభ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ చార్జీల పనితీరు బాగోలేదని కీలక వ్యాఖ్యలు చేసారు. అందుకే ఆదిలాబాద్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించి బాధ్యతల నుంచి తప్పుకుంటానని మంత్రి సీతక్క సంచలన ప్రకటన చేశారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ వేద్దామని మీనాక్షి నటరాజన్ ప్రపోజల్ పెట్టారు. మరోవైపు అంతకుముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై కూడా సీరియస్ అయ్యారు సీతక్క. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కులగణనపై అభ్యంతరాలుంటే శాసనమండలితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అభిప్రాయం చెప్పాలి కానీ.. ఇష్టానుసారం మాట్లాడి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని మండిపడ్డారు.