కేటీఆర్, హరీష్ రావు బతుకంతా అబద్దాల ప్రచారమే అని ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆడిపోసుకోవడమే వాళ్లకు పనిగా ఉంది. తెలంగాణ ను బదనాం చేసి కుర్చీ దక్కించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తన అధికార దాహం కోసం ప్రజలను బలి పెట్టడానికి కూడా సిద్ధమౌతున్నారు. రైతులను రెచ్చగొట్టి బతుకుదామని ఆరాటపడుతున్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దారుణంగా దెబ్బ తీసి ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు.
బీజేపీ తో కుమ్మక్కై లోక్ సభ, శాసన మండలి ఎన్నికల్లో పని చేసింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి పైన ద్వేషంతో బీజేపీ ని గెలిపించి బీఆర్ఎస్ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నది. అసలైన మోదీ కోవర్టు, ఫేవరెట్ కూడా కేసీఆరే. బీజేపీకి లాభం చేయడానికి బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ పెట్టి హడావుడి చేసింది కేసీఆర్ కాదా.. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తున్న.. సహకరించమని మోదీ ని కోరింది కేసీఆర్ కాదా.. తెలంగాణకు ఏమీ వద్దు మీ ప్రేమ చాలంటు మోదీకి ప్రేమ లేఖలు రాసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్.