రేపు అసెంబ్లీకి రానున్న మాజీ సీఎం కేసీఆర్

-

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రేపు  అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు.  బుధవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నట్టు సమాచారం. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ
సమావేశంలో పట్టు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ  శాసనసభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని, తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి
కొరతపై అసెంబ్లీలో మండలిలోను పోరాడాలన్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు
మద్దతుగా బీఆర్ఎస్ గొంతు వినిపించాలని.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై
మాట్లాడాలన్నారు. అలాగే ప్రతీరోజు ఉదయం అరగంట ముందే అసెంబ్లీకి హాజరై ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా చర్చించుకున్న తరువాత హౌస్ లోకి వెళ్లాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news