కుంభమేళా ద్వారా భారత శక్తిని ప్రపంచమంతా చూసింది అని భారత ప్రధాని మోడీ పేర్కొన్నారు. తాజాగా ఆయన లోక్ సభలో మాట్లాడారు. కుంభమేళా విజయవంతం కావడంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉంది. మహాకుంభమేళా ఓ చారిత్రక ఘట్టం అన్నారు. కుంభమేళా దేశ ప్రజలందరినీ ఐక్యం చేసింది అన్నారు. కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు చేశారని తెలిపారు.

దేశ ప్రజలకు, ప్రయాగ్ రాజ్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మన శక్తి సామర్థ్యాల పై ఉన్న అనుమానాలను కుంభమేళా పటా పంచలు చేసింది. ఇది భవిష్యత్ తరాలకు ఓ ఉదాహరణ గా నిలుస్తుంది అన్నారు. యువత కూడా మహాకుంభ మేళాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా కుంభమేళాలో దేశ వ్యాప్తంగా ప్రజలు పాల్గొనడం గొప్ప విషయం అన్నారు. ఇది దేశ ప్రజల విజయం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.