రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగంలో అన్ని అబద్దాలే చెప్పారు. బడ్జెట్ స్పీచ్ లోనూ అబద్దాలు చెప్పారు. రూ.5లక్షల రుణాల వరకే వడ్డీలేని రుణాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు రూ.75 ఇచ్చారో లేదో అడుగుదాం. ఇచ్చింది రూ.50 అయితే.. రూ.75 ఇచ్చామని అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు.
వడ్డీలేని రుణాలల్లో మహిళలకు మోసం జరుగుతోంది. మాది మహిళల ప్రభుత్వం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఎంతో మంది ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తే.. ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇంట్లో కొత్త సభ్యులను కూడా యాడ్ చేశామని తెలిపారు. పచ్చి అబద్దాలు, పిచ్చి ఆరోపణలతో ఇవాళ ప్రసంగం కొనసాగింది. బడ్జెట్ లో 2 పేజీలు పెరిగాయి తప్పా.. పేదలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు హరీశ్ రావు.