- రూ.8.30 కోట్లతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ డాంబికాలపై సాక్షాత్తూ బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఈవో కోటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దసరాను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం…బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు కనీసం ఒక్క రూపాయి కూడా విదిల్చలేదని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దసర ఉత్సవాల నేపథ్యంలో బుధవారం పాలక మండలి సమావేశం జరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాలను పారదర్శకంగా, రూ.8.30 కోట్లతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఈవో కోటేశ్వరమ్మ చెప్పారు. అమ్మవారి చీరల ద్వారా రూ.40 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వీఐపీ దర్శనం ఉంటుందని కోటేశ్వరమ్మ తెలిపారు.