కౌశల్ గురించి సూపర్ స్టార్ ట్వీట్..!

-

బిగ్ బాస్-2 విన్నర్ గా కౌశల్ తన విజయానికి కారణమైన కౌశల్ ఆర్మీతో సెలబ్రేట్ చేసుకున్నాడు కౌశల్. తన ఈ విజయానికి కారణం మహేష్ బాబు కూడా అనేలా తన మాటలతో సూపర్ స్టార్ ను పడగొట్టాడు. అంతేకాదు కౌశల్ పవన్ ప్రస్థావన కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి కౌశల్ ఫ్యాన్స్ తో తాను హీరోగా ప్రయత్నాలు మొదలు పెడతానని చెప్పాడు.

ఇక కౌశల్ మహేష్ ప్రస్థావన తెచ్చేసరికి మహేష్ కూడా కౌశల్ మీద ఓ ట్వీట్ చేసి విష్ చేశాడు. బిగ్ బాస్ విన్నర్ గా గెలిచినందుకు కౌశల్ కు కంగ్రాట్స్ చెప్పిన మహేష్ ఇది నీ గొప్ప విజయమని ఈ విజయాన్ని నువ్వు ఎంజాయ్ చేయమని మహేష్ స్పెషల్ ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ తో కౌశల్ ఆర్మీ ఫుల్ ఖుషి అయ్యిందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ లో 18 మంది కంటెస్టంట్స్ పాల్గొనగా కౌశల్ తో పాటుగా గీతా మాధురి ఫైనల్ 2లో స్థానం సంపాదించింది. గీతా మాధురి రన్నరప్ గా నిలవగా కౌశల్ విన్నర్ గా టైటిల్ గెలుచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news