కేటిఆర్ రియాక్షన్ కి ఆ గ్రామం ఫిదా అయిపోయింది…!

-

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ భగీరథ. ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి అనేది కెసిఆర్ సంకల్పం. అందుకే దాదాపు అన్ని గ్రామాలకు తాగు నీరు అందిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. యుద్ద ప్రాతిపదికన తెలంగాణా ప్రభుత్వం ఈ కార్యక్రమ౦ పూర్తి చేసింది. దీనితో ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాల్లో ఇప్పుడు తాగునీటి సమస్య దాదాపుగా తొలగిపోయింది అనే చెప్పాలి.

అయితే కొన్ని గ్రామాల్లో ఈ నీటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. స్థానిక అధికారుల తప్పిదం నేపధ్యంలో కొందరికి చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఇలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల౦లోని సిద్దారం గ్రామంలో ఇదే సమస్య వచ్చింది. ఈ నేపధ్యంలో గ్రామస్థుడు ఒకరు ట్వీట్ చేసి సమస్యను మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. మంగళవారం ఉదయం ట్వీట్ చేసారు.

వెంటనే స్పందించిన కేటిఆర్ గ్రామంలో ఉన్న నీటి సమస్య గురించి వాకబు చేసి అధికార యంత్రాంగం మొత్తాన్ని నాలుగు గంటల్లో పంపించి నీటి నాణ్యతకు సంభందించిన పరిక్షలు చేయించారు. లోపం ఎక్కడ ఉంది అనేది అధికారులు తేల్చారు. వెంటనే స్పందించిన అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. దీనితో గ్రామం మొత్తం ఆరు నెలలుగా పడుతున్న ఇబ్బందికి కేటిఆర్ గంటల వ్యవధిలో పరిష్కారం చూపించడంతో ఆయన స్పందనకు ఫిదా అయిపోయింది గ్రామం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామం కంచుకోట. అయినా సరే ఇప్పుడు కేటిఆర్ స్పందన చూసి సాహో కేటిఆర్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news