కరోనా వచ్చేస్తుంది… జాగ్రత్తగా ఉండండి…!

-

భారత్ కి కరోనా వచ్చేస్తుంది… అవును ఇప్పుడు ఆ వ్యాధి మరింత తీవ్రమవుతుందని అంటున్నారు. దేశంలో చల్లటి ప్రాంతాల్లోకి ఈ వైరస్ ఇప్పుడు వేగంగా విస్తరించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు చైనాలో అన్ని నగరాలకు ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే గాలి ద్వారా వేగంగా విస్తరిస్తుంది ఈ వైరస్.

ఇక మన దేశంలోని చైనా సరిహద్దుని పంచుకున్న ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు అక్కడ చల్లటి వాతావరణం ఉంది. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో చైనా చొరబాట్లు ఉంటాయి. దీనితో చైనా నుంచి వైరస్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇక అక్కడి ప్రజలకు ఈ వైరస్ గురించి ఇప్పటికే అవగాహన కూడా అధికారులు కల్పిస్తున్నారు. వైరస్ సోకినా సరే అది త్వరగా బయటపడదు, పడేలోపు నలుగురికి వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దీనికి సంబంధించిన పరిక్షలు జరుగుతున్నాయి. అన్ని విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించడమే కాకుండా చైనా విమానాలను రద్దు చేసారు.

ఇక ఇప్పుడు ఈ వైరస్ వేగంగా చల్లటి ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. కేరళ చల్లగా ఉంటుంది… అలాగే తమిళనాడులోని ఊటి సహా అనేక చల్లటి ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఉంటుందని అంటున్నారు. బెంగళూరు కూడా చల్లటి ప్రాంతమే కాబట్టి అక్కడ కూడా ఈ వైరస్ కి అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ లో కూడా వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news