సినిమా స్టార్ హీరోలకు ఐటి అధికారులు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఐటి దాడులతో భయపెడుతున్నారు. ముఖ్యంగా దక్షినాది స్టార్ హీరోలను లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు చేస్తున్నారు. మూడు నెలల క్రితం ఐటి తెలుగులో ఐటి దాడులు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమిళ పరిశ్రమను కూడా ఐటి దాడులు భయపెడుతున్నాయి. తాజాగా స్టార్ హీరో విజయ్ ఇంటిపై ఐటి దాడులు చేసారు.
ఆయనను దాదాపు 5 గంటలకుపైగా అధికారులు విచారించారు. సినిమా షూటింగ్ లో ఉండగా ఆయనను పిలిచి విచారించారు అధికారులు. ఆయనకు సంబంధించిన సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ పై కూడా ఐటి దాడులు చేసారు. ఇక ఆయన ఆస్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులు సేకరించారు. పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారనే ప్రచారం ఇప్పుడు తమిళ పరిశ్రమను భయపెడుతుంది.
టాలివుడ్ లో గత ఏడాది ఐటి దాడులు భయపెట్టిన సంగతి తెలిసిందే. రాజకీయ కారణాలతో ఐటి దాడులు చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు దక్షిణాది బిజెపి టార్గెట్ చేసిందని అందుకే సిని పరిశ్రమలో ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తుందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. తెలుగులో మహేష్ బాబు, నాని, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మీద ఐటి దాడులు చేసారు.