ఆఫ్-షోల్డర్ డ్రెస్ తో పార్లమెంట్ కి వెళ్ళిన ఎంపీ…!

-

పార్లమెంట్’ దేశ అత్యున్నత వ్యవస్థలలో ఒకటి. అక్కడికి వెళ్ళే ప్రజా ప్రతినిధులకు ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళు ఎంతో గౌరవంగా కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. మాట, వస్త్రాదారణ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం విమర్శల పాలు అవుతారు అనేది వాస్తవం. తాజాగా ఒక మహిళా ఎంపీ యుకెలో ఇదే విధంగా విమర్శల పాలైంది. ఆమె పేరు ట్రేసీ బ్రాబిన్.

సదరు ఎంపీ గారు పార్లమెంట్ కి వెళ్ళే సమయంలో ఆఫ్-షోల్డర్ దుస్తులను ధరించి వెళ్ళారు. ఇది చూసిన ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి అడిగాడు. మేడం ఇది సరైన వస్త్రధారణ ఏనా అని…? ఈ ట్వీట్ వైరల్ అయ్యింది మరియు చాలా మంది దీనిపై స్పందించారు. పలువురు విమర్శించగా, మరి కొంత మంది అయితే ఆమె ఇష్టం అన్నారు. దీనిపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు.

“హలో. క్షమించండి, మీ అందరికీ దీనిపై సమాధానం చెప్పడానికి నాకు సమయం లేదు, కాని నేను అది తప్పని చెప్పగలను.. ప్రజలు భుజం మీద ఇంత ఉద్వేగానికి లోనవుతారని ఆ ఎంపీ గారు ట్వీట్ చేసారు. దీనికి ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు వచ్చినా మరి కొందరు మాత్రం ఆమె చెప్పిన సమాధానాన్ని సమర్ధించడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news