సింహం గడ్డం గీసుకుంది …!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకి గుడ్ బాయ్ చెప్పి ఫ్యాన్స్ గుండెల్లో గుణపాలు దింపేశారు. అయితే రాజకీయాలలో జనసేనుడిగా జనాలకి సేవ చేయాలని అక్కడ ప్రత్యక్షమవడంతో పర్లేదులే ఏలాగోలా చూసుకుంటున్నాము… అప్పటికంటే ఇప్పుడే నయం కాస్త మా మధ్య కొచ్చి మమ్మలిని పలకరిస్తున్నారు అని సంతోష పడ్డారు. అయితే ఫ్యాన్స్ కి మాత్రం ఆయన సినిమాలు చేస్తేనే మాకు ఆనందంగా ఉంటుంది. మాకు ఆ ఆనందం మళ్ళీ ఇస్తారా ..! అంటూ అత్తారింటికి దారేది సినిమాలో తాతయ్య అడిగినట్టు అడిగారు. దాంతో పవన్ రాజకీయాల సంగతి పక్కన పెట్టకుండానే మళ్ళీ సినిమాలు చేస్తున్నా అంటూ పింక్ సినిమా రీమేక్ కోసం రెడీ అయిపోయారు. ఈ ప్రకటన చూసిన పవన్ ఫ్యాన్స్ కి ఆనందం అంతా ఇంతా కాదు.

 

ఇక సంక్రాంతి తర్వాత సైలెంట్ గా పింక్ సినిమా రీమేక్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా కనిపిస్తున్న గుబురు గడ్డంతోనే షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే అలా గడ్డంతో ఉన్న సీన్స్ మొత్తం షూటింగ్ కంప్లీటయిందని తాజా సమాచారం. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్ చేసుకొని నీట్ గా కనిపిస్తున్న లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్‌నెట్ లో దర్శనమిస్తున్నాయి.

 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గడ్డం తీసేసిన తర్వాత సీన్స్ ని చిత్రీకరిస్తున్నారట. ఇక త్వరలో ఈ సినిమాలో పవన్ కి సంబంధించిన సీన్స్ మొత్తం కంప్లీటవుతాయట. ఈ సినిమాకి ప్యాకప్ చెప్పేసి తర్వాత క్రిష్-ఏ.ఎం.రత్నం కాబినేషన్ లో రూపొందబోయో సినిమాలో జాయిన్ అవుతారట. ఈ సినిమా కంప్లీట్ చేసి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమాతో సెట్స్ మీదకు వెళతారని సమాచారం. ఇక తాజాగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్ ఫొటో చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సింహం గండ్డం గీసుకుందని మళ్ళీ సూపర్ లుక్ తో అదరగొట్టారని చెప్పుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news