రైల్వే స్టేషన్ లో ఇక ఉమ్ము వేస్తే తాట తీస్తారు…!

-

రైల్వే స్టేషన్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఎన్ని విధాలుగా ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా సరే మార్పు మాత్రం రావడం లేదు. పరిశుభ్రత అనేది చాలా వరకు ప్రధానం. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో జనం మాత్రం దానిని ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. ఈ నేపధ్యంలో భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిశుభ్రతే ప్రధాన ఎజెండాగా కీలక నిర్ణయం తీసుకుంది.

రైల్వే స్టేషన్ లో ఇక నుంచి కావాలని చెత్తవేసినా, మూత్రం పోసినా, గోడలను పాడుచేసినా, పక్షులకు ఆహారం వేసినా, తినే పాత్రలు కడిగినా సహించవద్దని నిర్ణయం తీసుకుంది. ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’లో భాగంగా వారికి భారీ జరిమానాలు విధించాలని తూర్పు కోస్తా రైల్వే శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10 నుంచి అవి అమలులోకి వస్తాయి. స్టేషన్‌ కేటగిరీని బట్టి జరిమానాలు ఉంటాయి. స్టేషన్‌ మేనేజర్లు, సూపరింటెండెంట్లు, కమర్షియల్‌, ఆపరేషనల్‌ విభాగాల్లో టిక్కెట్‌ కలెక్టర్‌, ఆపై స్థాయి అధికారులు, గజిటెడ్‌ అధికారులు, ఆర్‌పీఎఫ్‌ అధికారులు (ఏఎస్‌ఐ కంటే పైస్థాయి) జరిమానాలు విధిస్తారు. ఒకసారి ఆ జరిమానాలు చూస్తే,

చెత్తాచెదారం వేస్తే… రూ.100 నుంచి రూ.200
వంట చేస్తే రూ.500
ఉమ్మితే…రూ.200 నుంచి రూ.300
మూత్రం పోస్తే…రూ.300 నుంచి రూ.400
పక్షులు, జంతువుల ఆహారం వెదజల్లితే రూ.300 నుంచి రూ.500
పాత్రలు కడిగినా, దుస్తులు ఉతికినా రూ.300 నుంచి రూ.500
రైల్వే ఆవరణలో అనుమతి లేని నిల్వలు చేస్తే రూ.5,000
అనుమతి లేకుండా పోస్టర్లు అతికిస్తే…రూ.1,000 నుంచి రూ.2,000
అమ్మకందారులు డ్రై, వెట్‌ వేస్ట్‌లకు వేర్వేరు బిన్లు పెట్టకపోతే…రూ.వేయి నుంచి రూ.2 వేలు.
50 మైక్రాన్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ ఉపయోగిస్తే…రూ.300 నుంచి రూ.500

Read more RELATED
Recommended to you

Latest news