5 ఏళ్ళ తర్వాత బ్యాట్ పట్టిన సచిన్…!

-

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్ళీ క్రికెట్ ఆడాడు. అయిదేళ్ళ తర్వాత బ్యాట్ పట్టి ఫోర్ కొట్టాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఛారిటీ మ్యాచ్‌లో ఐదున్నర సంవత్సరాల తర్వాత బ్యాటింగ్‌కు దిగాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తన అభిమానులను ఉద్వేగానికి గురిచేశాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ అనిపించుకునే సచిన్, బుష్ఫైర్ బాధితులకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన మ్యాచ్‌లో ఆడాడు.

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ బౌలింగ్ చేస్తుండగా సచిన్ బ్యాటింగ్ చేసాడు. ప్రస్తుతం సచిన్ భుజం గాయంతో బాధపడుతున్నా క్రికెట్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఈ వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో టెండూల్కర్ పెర్రీ విసిరిన బంతిని ఎదుర్కొని బౌండరీని కొట్టాడు. దీనితో ఇంటర్నెట్ లో అతని అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

క్రికెట్ లెజెండ్ యొక్క వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.c టెండూల్కర్ బ్యాటింగ్ చూడటం, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి తెచ్చిందని చాలా మంది అభిప్రాయపడగా, మరికొందరు దీనిని సూపర్ ఎమోషనల్ గా మార్చారని కామెంట్ చేసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news