తిరుమల మే నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల !

-

కలియుగ వైకుంఠం.. తిరుమలలో శ్రీ వేకంటేశ్వరస్వామి దర్శనం కోటిజన్మల పాపాన్ని హరించడమే కాదు… సమస్త కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. ఆ స్వామివారి దర్శనమే అంత ఫలం ఉంటే స్వామివారికి నిత్యం జరిగే ఆయా ఆర్జిత సేవల్లో పాల్గొంటో దాని ఫలితం మరింత విశేషం. ఆయా సేవలకు సంబంధించిన టికెట్లను టీటీడీ బోర్డు రెండు నెలల ముందే ఆన్లైన్లో ఉంచుతుంది.

ప్రస్తుతం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో ఉంచింది. మొత్తం 72,773 టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. వీటిలో డిప్ విధానంలో 11, 11498 టిక్కెట్లు, సుప్రభాత సేవకు 8143 టిక్కెట్లు, తోమాల సేవకు 120, అర్చనకు 120, అష్టదళపద్మారాధన సేవకు 240, నిజపాద దర్శనంకు 2875 చొప్పున ఉంచింది. అలాగే, ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 61,275 ఆర్జితసేవా టికెట్లను కూడా ఉంచింది. వీటి వివరాలను పరిశీలిస్తే,

విశేషపూజ – 2000, కల్యాణోత్సవం – 14,725, ఊంజల్ సేవ – 4,650, ఆర్జిత బ్రహ్మూత్సవం-7,700, వసంతోత్సవం-15,400, సహస్రదీపాలంకార సేవ- 16,800 చొప్పున ఉంచింది. ఇక ఆలస్యమెందుకు మేనెలలో ఆర్జిత సేవలకు టికెట్లను బుక్‌ చేసుకుని స్వామి సేవలలో పాల్గొనండి. వైకుంఠనాథుడి అనుగ్రహం పొందండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news