అమెరికా ఎన్నికల బరిలోకి….”తెలుగు మహిళ”..!!!

-

ఒకప్పుడు కేవలం వంట గదికి మాత్రమే పరిమితం అయిన మహిళలు, ఎన్నోఅవరోధాలను దాటుకుంటూ మూఢనమ్మకాల చెర నుంచి ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు. ప్రతి రంగంలోనూ వారి కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా  భారత సంతతి మహిళలు  అనేక రంగాలలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో భారత సంతతి మహిళలు రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అమెరికా ఎన్నికల రేసులోకి భారత సంతతి మహిళ పోటీకి దిగారు…

ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన మంగ అనంతాత్ముల అమెరికా కాంగ్రెస్ బరిలో నిలిచారు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ పార్టీ తరుపున  వర్జీనియాలోని 11వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ స్థానం నుంచి పోటీ చేయడానికి మంగ నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరమే ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. గతంలో రక్షణ ఉత్పత్తులపై ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మంగ స్థానికంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదిలాఉంటే

 

పుట్టింది ఆంధ్రాలో అయిన పాఠశాల విద్య చెన్నైలో, గ్రాడ్యుయేషన్ ఆగ్రా యూనివర్సిటీ లో  పూర్తి చేశారు. తరువాత 1990లో కుటుంబంతో అమెరికా వచ్చేశారు. ప్రస్తుతం మంగ పోటీ చేస్తున్న స్థానంలో ఆసియా జనాభా శాతం 17 శాతం ఉంటే అందులో సుమారు 7 శాతం మంది భారతీయులు ఉండటం ఆమెకి కలిసొచ్చే అంశం. అయితే ఈ స్థానం నుంచీ గతంలో కాంగ్రెస్ సభ్యుడు అయిన జేరీ ఆరు సార్లు పోటీ చేసి గెలువగా అదే అభ్యర్ధిపై మంగ పోటీ కి దిగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news