40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది నాకు ఎదురు లేదు తిరుగులేదు అని అనుకొని కనీసం జగన్ ని తన ప్రత్యర్థి గా కూడా చంద్రబాబు గుర్తించ లేకపోయి తక్కువ అంచనా వేసి ఎన్నికలలో ఓడిపోయారు అంటూ రాజకీయ విశ్లేషకులు అప్పట్లో అన్నారు. అయితే అధికారంలోకి వచ్చినా జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబు కు సంబంధించి రాజకీయంగా అంతమొందించడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాను ప్రతిపక్షంలో ఉండగానే రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఇన్సిడర్ ట్రేడింగ్ చేశారు అంటూ ఆరోపిస్తూనే ఉన్నా విషయం అందరికీ తెలిసినదే.
ప్రస్తుతం అధికారంలో ఉండటంతో ఇన్సిడర్ ట్రేడింగ్ కి సంబంధించి అమరావతి భూముల విషయంలో జగన్ వేస్తున్నా సిఐడి ఉచ్చు లో చాలామంది తెల్ల రేషన్ కార్డు దారులు కోట్ల విలువ భూములు కొనడం తో పాటు వారు తెలుగుదేశం పార్టీకి చెందినవారు అని తేలడంతో జగన్ వేసిన ఈ ఎత్తుగడకు బాబు ఇరుక్కుపోవడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతుంది.
సిఐడి దర్యాప్తులో రాజధాని భూముల విషయంలో స్థితి కి స్థాయికి మించి భూములు కొన్న వారి విషయంలో…ఆధారాలతో సహా బయట పెట్టి వారిని జైలుకు పంపించడానికి జగన్ సరికొత్త స్కెచ్ వేసినట్లు ఇంకా అన్ని విషయాలు బయటపడితే కనుక ఇదే కేసులో చంద్రబాబు నీ కూడా జైలుకు పంపించడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు టాక్.