ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చేపట్టాక ఎక్కడా కూడ సామాన్య ప్రజలకు ప్రభుత్వపరంగా కష్టాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్య, వైద్యం విషయాలలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని పేదవాడికి అండగా ఉండే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెడుతూ అద్భుతమైన సంక్షేమ పాలన దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా జగన్ పరిపాలిస్తూ వస్తూ ఉన్నారు.
ఇదే తరుణంలో చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిపై కూడా గట్టిగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో డీజీపీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు ని జగన్ గట్టిగా టార్గెట్ చేసి ఆయన చేసిన అవినీతి బాగోతం అంతా బయటపెట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా దేశానికి మరియు రాష్ట్రానికి సంబంధించిన ఆయుధ పరికరాల కొనుగోలు విషయంలో దేశానికి సంబంధించిన టెక్నాలజీ విషయాలను పొరుగుదేశం ఇజ్రాయెల్ కి చెప్పటం జరిగిందని విచారణలో తేలింది. అంతేకాకుండా కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఇంతగా టార్చర్ మరియు టార్గెట్ చేయడానికి గల కారణం మరియు సీక్రెట్ ప్లాన్ ఏంటంటే గతంలో ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయడమే అట అని వైసీపీ పార్టీలో టాక్.