రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 55వ రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేపట్టారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. అమరావతి కోసం కొందరు దీక్ష చేస్తున్నారు అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలుయజేసారు. ఆరోగ్యం విషమించినా రాష్ట్ర భవిష్యత్ అమరావతిని వదలలేదు అని అన్నారు. పోలీసులు దీక్ష భగ్నం చేసినప్పటికీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు యువకులు అని నారా లోకేష్ అన్నారు.
అమరావతి కోసం ఆందోళనలు 55 రోజులు అయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు కరగలేదు అని అన్నారు. ఈరోజు అమరావతి రైతులకు చేసిన అన్యాయం రేపు విశాఖ వాసులకు చేయరని నమ్మకం ఏంటి అని నారా లోకేష్ ప్రశ్నించారు. అంతేకాకుండా మూడు రాజధానులు ఫై మరొకసారి వ్యాఖ్యానించారు నారా లోకేష్. మూడు ముక్కల రాజధాని వొద్దు, అభివృద్దే ముద్దు అని అన్ని ప్రాంతాల వారు ముక్త కంఠంతో చెబుతున్నారు. జగన్ గారికి మాత్రం ఇది అర్ధం కావడం లేదని విమర్శలు గుప్పించారు.