ఎప్పుడు ఏ గ్రామంలోకి వస్తానో తెలియదు, కెసిఆర్ కీలక వ్యాఖ్యలు…!

-

25 రోజుల్లో గ్రామాల్లో మార్పు రాకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. గ్రామాల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. తాజాగా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ సందర్భంగా కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. గ్రామాల అభివృద్ధి, అధికారుల బాధ్యతలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు.

మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన విజయం సాధించడంతో ఇక పరిపాలన ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్దమయ్యారు. ఈ నేపధ్యంలోనే ఆయన అధికారుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మున్సిపల్ శాఖలో కాళీలు భర్తీ చేస్తామని అన్నారు. స్వయంగా తానే గ్రామాలను తనిఖీలు చేస్తా అని స్పష్టం చేసారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని అన్నారు.

త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి కేటిఆర్ కూడా పరిపాలన మీద దృష్టి పెడతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తాజాగా నిర్వహించిన సమావేశంలో కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే గ్రామ ప్రగతి విసయంలో కెసిఆర్ చాలా వరకు సీరియస్ గా ఉన్నారు. దీనితో ఇక అధికారులలో కొత్త భయం మొదలయింది.

Read more RELATED
Recommended to you

Latest news