జగన్ కి డిల్లీ ఆహ్వానం …!

-

2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది బిజెపి. 2014 కంటే అత్యధిక స్థానాలు గెలిచి పార్లమెంటులో తిరుగులేని పార్టీగా కేంద్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే అధికారంలోకి వచ్చాక బిజెపి తీసుకున్న సిఏఏ, ఎన్ఆర్సి నిర్ణయాల వల్ల దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో బీజేపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగగా బిజెపి పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

Image result for jagan kejriwall

మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని ఢిల్లీలో నమోదు చేసుకోవడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అసహనంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు ఢిల్లీలో బిజెపి పార్టీ ఓడిపోవడం పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అవ్వటంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఢిల్లీ నడిబొడ్డులో ఈ విజయం సాధించడంతో అది కూడా మోడీ మరియు అమిత్ షా ఉండే ప్రాంతంలోనే కేజ్రీవాల్ తన సత్తా చాటడంతో దేశవ్యాప్తంగా బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులు కేజ్రివాల్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

 

కాగా త్వరలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆహ్వానం పలికినట్లు వార్తలు వస్తున్నాయి. దిశ మరియు రివర్స్ టెండరింగ్ ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా మంచి ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకోవడంతో జగన్ తో కలిసి పనిచేయడానికి కేజ్రీవాల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news