సంచలనం, జమ్మూ కాశ్మీర్ లో కూడా తిరుమల…!

-

తిరుమల నమూనాలో జమ్మూకశ్మీర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కసరత్తులు చేస్తుంది. ఈ దేవాలయం కోసం అక్కడి ప్రభుత్వం అంగీకరించిందని సమాచారం. ఇందుకోసం 100 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి సిద్దమైందని తెలుస్తుంది. ఇందుకోసం జమ్మూ-కత్రా హైవే వెంబడి స్థలాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం కేటాయిస్తుందని ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం తాము అనుకున్నట్టు జరిగితే రెండేళ్ళల్లో ఆ నిర్మాణం పూర్తి చేస్తుంది టీటీడీ. తిరుమల నమూనాలో ఆలయ నిర్మాణంతో పాటు 100 ఎకరాల స్థలంలో ఒక వేద పాఠశాల, ఒక వైద్యశాల నిర్మించే ఆలోచనలో కూడా టీటీడీ ఉందని అంటున్నారు. ఆలయ నిర్మాణానికి రెండు స్థలాలు గుర్తించారని, జమ్మూలోని ధుమ్మి, మజిన్‌లో స్థలాలు ఇందుకు అనువుగా ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎంపీ వి.విజయ సాయి రెడ్డి సారథ్యంలోని టీటీడీ బోర్డు ప్రతినిధి బృందం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం యంత్రాగంతో చర్చలు జరిపిందని, అందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది అని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీని కూడా మేము కలిసామని, ఈ ప్రాజెక్ట్ గురించి వివరించామని, తిరుమల దర్శించే ఉత్తరాది భక్తుల కోసం అక్కడ నిర్మాణం చేపట్టాలని భావించినట్టు ఒక అధికారి వివరించారు. ఆలయం, వేద పాఠశాల, కల్యాణ మండపం, ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news