రానా ‘హాథీ మేరా సాథీ’ టీజర్ చూశారా.. భళ్లాలదేవనే మించిపోయాడుగా..!

-

భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన చిత్రం బాహుబలిలో విలన్ దగ్గుబాటి రానా భళ్లాలదేవగా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌లా ఆక‌ట్టుకున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆ త‌ర్వాత‌ రానా తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంతో భళ్లాలదేవుడుగా రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే తాజాగా ఆయన నటించిన బహు భాషా చిత్రం ‘అరణ్య’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’, తెలుగులో ‘అరణ్య’ టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో రానా గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. మానవులు-జంతువుల మధ్య సంబంధాల్ని ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా అడవిలో ఉండే ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ ‘హాథీ మేరా సాథీ’ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది. అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా రానా లుక్ ఆకట్టుకునేలా ఉంది.

మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. పెరిగిన గెడ్డంతో ఒంటి నిండా గాయాలతో అడవి జంతువుల మధ్య ఉగ్ర రూపం దాల్చి.. భళ్లాలదేవనే మించిపోయిన‌ట్టు క‌నిపిస్తాడు రానా. కాగా, ఇందులో జోయా హుస్సేన్‌, శ్రియ, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ లాంటి బ‌డా బాలీవుడ్ నిర్మాణ సంస్థ అర‌ణ్య సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news