ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నవరత్నాల హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాఠశాల, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ‘అమ్మ ఒడి’ ద్వారా చదువుకోవటానికి ఆర్ధిక భరోసా ఇస్తున్న ఏపీ సర్కార్ వృత్తి విద్యా కోర్సులు చేసే వారి కోసం కూడా వారికి అండగా ఉండే పథకాన్ని అందించనుంది. అలా ఈరోజు మరో అద్భుతమైన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు రంగం సిద్దమైంది.
విజయనగరం వేదికగా “జగనన్న వసతి దీవెన”పేరిట ఐటిఐ,పాలిటెక్నిక్ అలాగే డిగ్రీ మరియు ఆపైన చదువులు చదివే పేద విద్యార్థులకు కొంత నగదును అమ్మవడి లానే వారై తల్లి బ్యాంకు ఖాతాలలోకి వెయ్యనున్నారు.ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ పాఠం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 11 లక్షల 87 వేలకు మంది పైగా విద్యార్థులు లాభం పొందనున్నారని తెలుస్తుంది. ఐటీఐ చదివే విద్యార్థులకు 10 వేలు పాలి టెక్నిక్ చదివే వారికి 15 వేలు అలాగే డిగ్రీ ఆపై చదువులు చదివే వారికి 20 వేలు అందజేయనుంది.