అయ్యో పాపం వెంకయ్యనాయుడు …!

-

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కి చంద్రబాబు అత్యంత సన్నిహిత ఆప్తమిత్రుడు అని అందరికీ తెలిసినదే. ప్రస్తుతం చంద్రబాబు రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రంలో మంచి స్థానంలో ఉండి ఏం చేయలేక పోతున్నానే అన్న రీతిలో వెంకయ్యనాయుడు బాధపడుతున్నారని జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో బిజెపి పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో ఎదగటానికి కొద్దిగా అవకాశం వచ్చింది.Image result for chandrababu venkaiah naiduఅయితే ఆ సమయంలో వెంకయ్యనాయుడు వ్యవహారం వల్ల బిజెపి పార్టీ టీడీపీకి తోక పార్టీగా మారిపోయిందని అప్పట్లో వెంకయ్య నాయుడుపై ఆరోపణలు రావడం జరిగాయి. దానికి కారణం వెంకయ్యనాయుడు మరి చంద్రబాబు నాయుడు ఒకటే సామాజికవర్గం కాబట్టి కుల పిచ్చి తో బిజెపి పార్టీ ఏపీలో ఎదగకుండా చేయడం జరిగిందని అప్పట్లో భయంకరంగా వార్తలు వచ్చాయి.

 

ఇందువల్లనే మోడీ మరియు అమిత్ షా కావాలని వెంకయ్య నాయుడుకి ఇతర రాష్ట్రాలతో రాజకీయాలతో సంబంధం లేని ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది అని చాలామంది అంటారు. ఇటువంటి తరుణంలో ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో చంద్రబాబు పై జరిగిన దాడిని ఉద్దేశించి కేంద్రంలో ఉన్న బిజెపి నేతలు సరిగ్గా బాబుకి బాగా బ్యాండ్ తీస్తున్నాడని జగన్ ని కళ్ళముందే పొగడటం తో ఏం చేయలేని పరిస్థితి లో ఆప్త మిత్రుడు చంద్రబాబుని కాపాడుకోలేని స్థితిలో అయ్యో పాపం అన్నట్టు వెంకయ్య పరిస్థితి మారిందని చాలామంది సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news