ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా సరే 2024 ఎన్నికలకు ప్రభుత్వ వ్యతిరేకతను టార్గెట్ చేస్తూ ముందుకి వెళ్ళాలి అని భావిస్తున్న చంద్రబాబు సర్కార్ కి ప్రస్తుత పరిణామాలు కాస్త కలిసి వచ్చే విధంగానే ఉన్నా ఇప్పుడు ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారింది. అసలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేసినేని నానీ ఎక్కువగా పార్టీని ఇబ్బంది పెడుతున్నారు అనే చెప్పవచ్చు. ఆయన వైఖరి పార్టీ నేతలకు కూడా కాస్త చికాకు గా ఉందని అంటున్నారు. పార్టీ విధానం ఒకటి అయితే ఆయన విధానం మరొకటి అయింది. దీనితో పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఆయనపై చంద్రబాబుకి ఫిర్యాదు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఆయనలో మాత్రం మార్పు రావడం లేదట.
ఇటీవల వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం విషయంలో అయన సభ పెట్టారు. ఈ సభలో కాస్త వివాదాస్పద వ్యాఖ్యలే చేసారు. అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు బిజెపితో చంద్రబాబుకి స్నేహం అనేది చాలా అవసరం. ఈ తరుణంలో చంద్రబాబు ని కాదని సొంతగా నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీర్మానం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మద్దతు ఇస్తారని జగన్ మాట్లాడారు.
దీనితో ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆయనపై ఆగ్రహంగా ఉంది. చంద్రబాబు కూడా ఆయన్ను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసారట. ఈ విధానం సరికాదని చెప్పెసారట. దీనితో పార్టీకి రాజీనామా చెయ్యాలని కేసినేని భావిస్తున్నారు. పార్టీలో ఉండకుండా స్వతంత్ర ఎంపీ గా పార్లమెంట్ లో ఉండే ఆలోచనలో ఆయన ఉన్నారట. ఉగాది తర్వాతః ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు.