సైరా తో బాగా నష్టపోయిన రామ్ చరణ్ ..!

-

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన నటించిన సినిమా ‘సైరా’. ఈ కథ ని సినిమాగా చేయాలని చిరంజీవికి ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కలని నిజం చేసుకున్నారు. తన తనయుడు నిర్మాత గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి నటుడిగా చిరంజీవికి చాలా తృప్తిని ఇచ్చింది. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సస్ కాలేదు. ఒక్క తెలుగు వర్షన్ లోలో హిట్ అనిపించుకున్నప్పటికి హిందీ తో సహా ఇతర భాషల్లో ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇది నిర్మాతగా రామ్ చరణ్ కి బాగా దెబ్బ అని అంటున్నారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా సినిమాని నిర్మించిన నిర్మాత రామ్ చరణ్ కు ఫలితం ఏమీ దక్కలేదని అసలు విషయాన్ని ఇప్పుడు బయటకు చెబుతున్నారు.

 

నిర్మాత రామ్ చరణ్ నాన్నగారు రూపాయి పారితోషికం అయినా తీసుకోకుండా నటించారని.. 64 ఏళ్ల వయసులో 250 రోజులు నిరంతరం సినిమా కోసమే తపించారని తెలిపారు. ఆయనకు ఏం ఇచ్చి రుణం తీర్చుకోవాలో అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. అయితే సైరా రిజల్ట్ తో రామ్ చరణ్ కి నిరాశే మిగిలింది. ఇక సైరాతో వచ్చిన నష్టాల్ని పూడ్చేందుకు చరణ్ చాలానే జాగ్రత్త పడాల్సి వస్తుంది. అంతేకాదు ఖైదీనంబర్ 150 సినిమాతో భారీ లాభాలొచ్చినప్పటికి ఆ లాభాలు సైరా పట్టుకుపోయిందని అంటున్నారు.

ఇక మెగాస్టార్ తన కెరీర్ 152వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని దేవాదయ భూముల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట కొరటాల. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి చిరు గాని, దర్శకుడు కొరటాల గాని టైటిల్ ఏంటని రివీల్ చేయలేదన్న విషయం తెలిసిందే. అయితే తాజా ఒక సినిమా ఈవెంట్ కి హాజరైన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news