వకీల్ సాబ్ పై డైరెక్టర్ సాబ్ రియాక్షన్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణసారధ్యంలో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి ఈ చిత్రం రీమేక్ గా వస్తుంది. అయితే ఈ చిత్రానికి వకీల్ సాబ్ అన్న టైటిల్ ను ఫిక్స్ చేయగా తోలి పోస్టర్ గా పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ ఫస్ట్ తెగ వైరల్ గా మారింది. కొందరు పవన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ పలువురు రీట్వీట్స్ చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా ఈ ఫస్ట్ లుక్ పై స్పందించారు. సంవత్సరంలో అన్ని పండుగలు మొత్తం ఒకేసారి జరుపుకొనేలా ఫస్ట్ లుక్ ఉందంటూ కామెంట్ పెట్టి, టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. అయితే వివాదాల డైరక్టర్ ఆర్జీవీ మాత్రం తనదైన శైలి లో పోస్ట్ పెట్టారు. పవన్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎదురుచూసి దాని మీద సెటైర్ వేసే ఆర్జివీ వకీల్ సాబ్ పోస్టర్ మీద కూడా తనదైన శైలి లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వకీల్ సాబ్ పోస్టర్ ను యాడ్ చేసి డైరక్టర్ సాబ్ పోస్టర్ ఒకటి పెట్టాడు. అంతేకాదు తన మార్క్ కామెంట్ తో మళ్లీ పవర్ స్టార్ పై విమర్సలు చేశాడు.

వకీల్ సాబ్ పోస్టర్ కు ధీటుగా డైరక్టర్ సాబ్ అంటూ వర్మ కూడా టేబుల్ మీద కాళ్లు పెట్టి పోస్టర్ ఒకటి పెట్టి కొంతమంది ఇడియట్స్ గురించి నేను ఆలోచించను, ఇలాంటి ఇడియట్ పనులు చేయను అంటూ వకీల్ సాబ్ పోస్టర్ పై తన కామెంట్ పెట్టాడు ఆర్జివీ. అయితే మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అన్నా,పవన్ అన్నా అంతెత్తున లేచే వర్మ వకీల్ సాబ్ పోస్టర్ పై ఈ విధంగా రెస్పాండ్ అవడంలో పెద్దగా విచిత్రం ఏమి లేదు కానీ వర్మ కావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మళ్లీ రెచ్చగొట్టేందుకే ఇలా చేస్తున్నాడు అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news