కరోనా భయం తో వింత చేష్టలకు పాల్పడుతున్న జనాలు

-

చైనా లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా వైరస్ సోకి దాదాపు 3 వేల మందికి పైగా మృతి చెందారు. ఈ వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు తమదైన స్థాయిలో తీవ్ర కసరత్తులు కూడా చేస్తున్నాయి. కానీ ఎక్కడో ఒకచోట ఈ కరోనా వైరస్ కేసు నమోదు అవుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 60 దేశాల్లో వ్యాప్తి చెందగా మొత్తం 88 వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు చెబుతున్నారు. అయితే వారిలో సుమారు 3 వేల మంది ఇప్పటికే చనిపోగా చాలామంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చైనా తరువాత ఈ వైరస్ తీవ్రత ఇరాన్ దేశంలో ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇరాన్ లో కూడా ఈ వైరస్ సోకి 210 మంది చనిపోగా పలువురు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరాన్ రాజధాని తెహ్రాన్,కోమ్ లోనే ఎక్కువగా మరణాలు చోటుచేసుకుంటున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధిని నియంత్రించడానికి అక్కడి అధికారులు నిమగ్నమై ఉండగా అక్కడి ప్రజలు మాత్రం మూఢ విశ్వాసాలతో మరింత తలనొప్పులు తీసుకొస్తున్నారు.

కరోనా నియంత్రణ కోసం అని అధికారులు నానా తిప్పలు పడుతుంటే అక్కడి జనాలు మాత్రం వింతగా ఈ మహమ్మారి నుంచి దైవమే తమని రక్షిస్తుంది అంటూ పుణ్యక్షేత్రాలకు వెళ్లడమే కాకుండా వింతగా అక్కడి గోడలను,గ్రిల్స్ ను నాకుతున్నారట. అయితే ఒకపక్క కరోనా లాలా జలం నుంచి త్వరగా వ్యాప్తి చెందుతుంది అన్న విషయాన్ని మరచి ఇరాన్ ప్రజలు చేస్తున్న పిచ్చి పనికి అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఎవరైనా భగవంతుడు దగ్గరకి వెళ్లి ఇలా గోడలు నాకుతారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అధికారులు మాత్రం ఆలయ గోడలను,గ్రిల్స్ ను శుభ్రం చేస్తూ ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే చర్యలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే అక్కడి ప్రజలు ఇలా గోడలు,గ్రిల్స్ నాకుతున్న దృశ్యాలకు సంబందించిన వీడియో లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం తో ఇప్పుడుఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news