తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ముహూర్తం ఫిక్స్ ఐంది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22న ప్రకటించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే.