బంజారాహిల్స్‌లో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందడంతో ముందుగా సర్వే నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్‌లోని సర్వే నెంబర్ 102/1లోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆపై మూడు ఎకరాలకు ఫెన్సింగ్ వేసి అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. భూమి తమ సొసైసిటీది అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆరోపించారు.ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురవ్వకుండా హైడ్రా, రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది.