ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. నేడు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు

-

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపనున్నారు. నేడు పలువురు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉ.10:30 గంటలకు సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ ఉంటుంది. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చ ఉంటుంది. ఉ.11:15 గంటలకు అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌తో చంద్రబాబు నాయుడు సమావేశం జరుగనుంది.

cm chandrababu

కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై చర్చ ఉంటుంది. మ.12 గంటలకు పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటి ఉంటుంది. మ.1:40 గంటలకు అమిత్‌షాతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ఉంటుంది. మే 2 న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమిత్‌షాతో చర్చించనున్నారు చంద్రబాబు.

  • ఉ.10:30 గంటలకు సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ
  • పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చ
  • ఉ.11:15 గంటలకు అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌తో సమావేశం
  • కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై చర్చ
  • మ.12 గంటలకు పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటి
  • మ.1:40 గంటలకు అమిత్‌షాతో సీఎం సమావేశం
  • మే2న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీ
  • ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమిత్‌షాతో చర్చించనున్న చంద్రబాబు

Read more RELATED
Recommended to you

Latest news