జనతా గ్యారేజ్ లో కొడుకు విలన్.. కేటీఆర్ విలనేనా..? : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

-

ఖర్చులు తగ్గడానికే మంత్రులు హెలికాప్టర్ లో పోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముగ్గురు మంత్రులు వెళ్తే.. కాన్వాయ్ కి అయ్యే ఆర్థిక భారం కంటే ఒక హెలికాప్టర్ లో పోతే ఎంత ఖర్చు అవుతుందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. మీ లా సొంత విమానాలు కాంగ్రెస్ పార్టీకి లేవని పేర్కొన్నారు. కాళేశ్వరం చూసేందుకు కూడా ఆఫీసర్లు, విజిటర్లకు హెలికాప్టర్లు పెట్టడం లేదన్నారు.

ఒక రోజు రెండు, మూడు ప్రోగ్రాములుుంటాయని.. సుదూర ప్రాంతాలకు పోయి రావడం ఇబ్బందిగా ఉండే పరిస్తితుల్లోనే మంత్రులు హెలికాప్టర్లు వాడుతున్నారని చెప్పారు. మీలా ఇష్టానుసారంగా విలాసాలకు హెలికాప్టర్లు వాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ల టీఆర్ఎస్ కి ఏళ్లు అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటూూ కేటీఆర్ మాట్లాడుతున్నరని.. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ మోహన్ లాల్ కొడుకు విలన్ అని.. కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూడా విలనా..? అని సెటైర్లు వేశారు అద్దంకి.

Read more RELATED
Recommended to you

Latest news