హన్మ కొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లోని జలదృశ్యం వద్ద డా.కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి.. అలాగే అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కలిసి ఎల్కతుర్తి బయలు దేరారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షెడ్యూల్ ని పరిశీలించినట్టయితే.. సాయంత్రం 5.30 కి ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచి హెలికాప్టర్ లో స్టార్ట్ అవుతాడు. 6 PM కు ఎల్కతుర్తి బహిరంగ సభ ప్రాంగణంలో ఉన్న ఎలిప్యాడ్ కు చేరుకుంటారు. 6.15 నుంచి 6.45 వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. రాత్రి 7 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటాడు. 7 గంటలకు KCR స్పీచ్ స్టార్ట్ అవుతుంది. 7.40 వరకు KCR స్పీచ్ ఉంటుంది. దాదాపు 40 నిమిషాలు పాటు కేసీఆర్ స్పీచ్ కొనసాగుతుంది.