ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపేయండి.. చర్చలు జరపండి : కేసీఆర్

-

దేశంలో బీజేపీ 11 ఏళ్ల నుంచి పాలన చేపడుతుంది.. కానీ  తెలంగాణకు 11 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమి లేదని.. ఇంకా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను ఆంధ్రాలో కలిపిందని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట ఛతీస్ గడ్ లో యువత పై కేంద్ర ప్రభుత్వం ఊచకోత కోస్తుంది.

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపేయండి.. మావోయిస్టులతో చర్చలు జరపండి అని డిమాండ్ చేశారు కేసీఆర్. ఆర్మీ ఉంది కదా అని అలా ఊచకోత కోయకుండా.. చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నించండి అని సూచించారు కేసీఆర్. ఈ అంశం పై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఆవేశం పనికిరాదు.. ఆలోచన ఉండాలి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి పరిపాలన చేయ రావడం లేదన్నారు. ఇన్ని రోజులు కావాలనే మౌనంగా ఉన్నాను. ఇక నుంచి తాను కూడా రంగంలోకి దిగుతానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news