కేసీఆర్ 10వేల అబద్దాలు ఆడారు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

పదేళ్లలో కేసీఆర్ 10వేల అబద్దాలు ఆడారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ లకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ఇచ్చాక సోనియాగాంధీ దేవత అని కాళ్లు మొక్కిన మీరు.. ఇప్పుడు కాంగ్రెస్ విలన్ అంటారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్.. రూ.10వేల కోట్లు దోచుకుతిన్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా వేల కోట్ల భూములను ఆక్రమించుకున్నారని తెలిపారు.

మంత్రులు, అధికారుల ఫోన్ లను ట్యాపింగ్ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిందే నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు.. నాయకులు అని చెప్పారు. మలిదశ ఉద్యమం సయంలో శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. తాను మంత్రి పదవీ త్యాగం చేశానని.. పార్లమెంట్ లో రాజగోపాల్ రెడ్డి ఫైట్ చేశారని గుర్తు చేశారు. సొంత నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి నేతలు సైతం పోరాడారని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news