ఉనికి కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ సభ : జగ్గారెడ్డి

-

ఉనికి కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ సభ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాజాగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే నాకు గౌరవం అని.. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు. చాలా అనుభవజ్ఞులు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీ కుటుంబం పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 

కేసీఆర్ ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి అసెంబ్లీకి పోవడం లేదన్నారు. రేవంత్, కేసీఆర్ సభలో ఎదురుపడండి తెలంగాణ శాసనసభ ఎట్లా ఉంటాదో చూద్దామని సవాల్ విసిరారు. రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. గాంధీ కుటుంబం కోసం నెలలు నెలల వెయిట్ చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చే వరకు గాంధీ కుటుంబం హీరో అని కొనియాడారు. తెలంగాణ ఇచ్చిన తరువాత డూప్లీకేట్ గాంధీలు అయ్యారా..? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news