దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. వస్తే తాము చేస్తున్న అభివృద్ధిని వివరిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ కి రాకుండా పెద్ద పెద్ద సభలు పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ లు అన్ని పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పులు ఎట్లా ఉన్నాయని నిలదీశారు. మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సీఎం అయ్యే అర్హత ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము చేస్తున్న అభివృద్ధిని వివరిస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తోన్న ఆదరణ చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.