రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే ఇలాంటి పాలనను పుట్ బాల్ తన్నినట్టు తంతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంచి చేసిన మన పరిస్థితే ఇలా ఉంటే.. ఎన్నో మోసాలు చేస్తున్న చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతోంది. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందని.. రాత్రి వచ్చిన తరువాత పగలు రాకుండా ఉండదని తెలిపారు జగన్.
జనగణనతో పాటే కులగణన చేయాలనే కేంద్ర నిర్ణయం పై జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కులగణనను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య ’ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నామని.. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తరువాత అధికాంర కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తునే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు.