గూఢచారిని మెచ్చిన లోకేష్..!

-

అడివి శేష్ హీరోగా శషికిరణ్ తిక్క డైరక్షన్ లో వచ్చిన సినిమా గూఢచారి. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. వీకెండ్ కలక్షన్స్ లో 3.5 కోట్లతో దూసుకెళ్తున్న గూఢచారి సినిమాపై ఏపి పంచాయతి రాజ్ మంత్రి లోకేష్ స్పందించారు. గూఢచారి సినిమాపై లోకేష్ స్పందన సినిమాపై మరింత చర్చ జరిగేలా చేసింది.

ఫాస్ట్ ఫేస్డ్ స్పై థ్రిల్లర్ గూఢచారి సినిమాను థియేటర్ లో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశానని.. అడివి శేష్, శోభిత దూళిపాల, ప్రకాశ్ రాజ్ నటన అద్భుతమని అన్నారు. శషి కిరణ్ అండ్ టీం వర్క్ చాలా బాగుందని ట్వీట్ చేశాడు. అటు సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా గూఢచారి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. రివ్యూస్ కూడా బాగా రావడంతో సినిమాకు బీభత్సమైన మౌత్ టాక్ వచ్చింది.

ఎప్పుడు ఏదైనా సినిమా బాగుంటే ముందు స్పందించే తెలంగాణ యువ మంత్రి కే.టి.ఆర్ కన్నా ఈసారి లోకేష్ గూఢచారిపై స్పందించడం కూడా వైరల్ గా మారింది. మొత్తానికి సిని, రాజకీయ ప్రముఖులు గూఢచారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news