మనలోకం ఎక్స్ క్లూజివ్ : స్థానిక ఎన్నికల డేట్లు ఇవే ??

-

ఏపీ హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి పోవాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన నిధులు ఆగిపోతాయని తెలిపింది. దీంతో తాజాగా ఈ తేదీలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం రెడీ చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే మార్చి 21వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల పోలింగ్ జరగవచ్చని ఆ తర్వాత మూడు రోజులకే అనగా మార్చ్ 24 వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. Image result for elections in apతర్వాత మార్చి 27వ తారీకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని…ఈ మూడు ఎన్నికల ఫలితాలు మార్చి 31వ తేదీ లోపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దీంతో ఈ ఎన్నికల అన్నిటికీ జరపడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేయడానికి రెడీ అవుతోంది. ఇదే తరుణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ర‌ణ‌కు తాము సిద్ధ‌మ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ ఎన్. ర‌మేశ్ కుమార్ ప్ర‌క‌టించారు. మొత్తానికి ఇక పెద్ద‌గా గ్యాప్ లేకుండానే వ‌ర‌స‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న‌ట్టుగా స్ప‌ష్టం అవుతూ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news