కరోనా పరీక్షకు కిట్ కనుగొన్న చైనా..

-

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు కరోనా వైరస్.. చైనా లో పుట్టిన ఈ వైరస్ రోజు రోజుకీ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతూ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. సామాన్యులు రోడ్ల మీదకు రావాలంటేనే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో చైనా కరోనా వైరస్ ను కనుగొనేందుకు ఓ కిట్ ను రూపొందించింది..

 


జియామెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు కరోనా వైరస్ పై ప్రయోగాలు నిర్వహించారు. దీనితో పాటు ఆ వైరస్ ను పరీక్షించగల ఓ కిట్ ను కూడా వారు రూపొందించారు. ఈ కిట్ సహాయంతో కేవలం 29 నిమిషాల్లోనే కరోనా వైరస్ ను పరీక్షించవచ్చు. ఈ కిట్‌ను నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కోసం పంపారు. జియామెన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధనా బృందం దీనిని అభివృద్ధి చేసింది. క్లినికల్ కేసులు, అనుమానాస్పద కేసులు మరియు అధిక-ప్రమాద సమూహాలు పరీక్షించడానికి ఈ కిట్‌ను ఉపయోగించవచ్చు. కరోనావైరస్ సోకిన వ్యక్తులను శాంపిల్ చేసి త్వరగా పరీక్షించవచ్చు. ఆ తర్వాత వారికి చికిత్స అందించి త్వరగా కోలుకునే విధంగా చేయొచ్చని వారు అంటున్నారు.

అయితే ఇంతటి ప్రమాదకరమైన వైరస్ ను ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రంగా పరిగణించటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది. ఈ సమయంలో ప్రపంచం మరింత తీవ్రతను చూపించాల్సిన అవసరం ఉందని. చైనా నుండి వ్యాపించిన ఈ వైరస్ ప్రపంచంలోని 85 కి పైగా దేశాలకు చేరుకుంది. ఇప్పటివరకు 3,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వ్యాది సోకిన వారి సంఖ్య లక్షకు చేరుకుంటోందని గుర్తు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news