ట్రంప్ కళ్ళముందే కరోనా పేషెంట్ లు? .. వణికిన అగ్రదేశం ప్రెసిడెంట్ !

-

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం 70 దేశాలకు పైగానే వ్యాపించింది. చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు మూడు వేల మందికి పైగానే ఈ వైరస్ వల్ల చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 90 వేల మంది చైనాలో ఈ వ్యాధి వల్ల మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. దీంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ వైరస్ తమ దేశంలో రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా మనిషి నుండి మనిషికి అంటువ్యాధులు సోకే ఈ మహమ్మారి వ్యాధి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది.Image result for coronavirus donald trumpతాజాగా ఈ వైరస్ వ్యాధి అమెరికా దేశానికి కూడా పాకి పోయింది. ఏకంగా అధ్యక్షుడు ట్రంప్ కళ్ళముందే ఉండే అధికారులకు ఈ వ్యాధి సోకడంతో అంతర్జాతీయంగా ఈ వార్త హైలెట్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే  గత నెల 26 నుంచి 29 వరకూ వాషింగ్టన్ లో నిర్వహించిన కన్జర్వేటివ్ పొలిటికల్ కాన్ఫరెన్స్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.

 

ఈ సదస్సులో పాల్గొన్న ఇద్దరికీ కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇప్పటికే అమెరికా లోని 30 రాష్ట్రాలకు ఈ ప్రాణాంతకమైన కరోనా వ్యాపించింది. అమెరికాలో బాధితుల సంఖ్య 401 చేరగా మృతుల సంఖ్య 19కి చేరింది. అయితే ట్రంపు సదస్సులో పాల్గొన్న వారికి కరుణ వైరస్ సోకడంతో… ప్రస్తుతం కలకలం రేగింది. దీంతో కరోనా ఎఫెక్ట్ తనకి కూడా ఉందేమో అని డోనాల్డ్ ట్రంప్ భయపడి వణికిపోయి టెస్టులు కూడా చేయించుకున్నట్లు ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news