కొట్టుకోకండి ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకుంటారులే ..!

-

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ పొలో మంటూ సినిమాల మీద పడ్డ సంగతి తెలిసిందే. అసలు సినిమాలే చేయను అన్న పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ఇప్పటికే రెండు సినిమాలు యమా స్పీడ్ గా షూటింగ్ ని జరూకుంటున్నాయి. తాజాగా పవన్ కళ్యాన్ 26వ ‘వకీల్ సాబ్’ రిలీజ్ కావడానికి ముందు రెడీ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు కాస్త ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ నెల 21 నుంచి ఫైనల్ షెడ్యూల్ జరుగుతుందట. ఈ షెడ్యూల్ లోనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సంబంధిచిన టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తారట.

 

????????????????????????????????????

అంతేకాదు ఈ సినిమాకి పవన్ మార్క్ కమర్షియల్ అంశాలని జోడిస్తున్నారట. అందుకే హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం. పవన్ కి జోడిగా ఓ హీరోయిన్ నటించనుందని తాజా సమాచారం. ఆ హీరోయిన్ గా నటించే ఛాన్స్ గోవా బ్యూటీ ఇలియానాకి దక్కిందని తెలుస్తోంది. అనుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా హిట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ కి జంటగా ఇలియానా ఉంటే బావుంటుందని పవన్ కళ్యాణ్ మెకర్స్ కి సూచించారట. అందుకే ఇలియానాని సంప్రదించారని తెలుస్తోంది.

అంతేకాదు ఇలియానా తో పాటుగా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ పేరును కూడా చర్చలో అనుకున్నారట. మరి ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇలియానా పవన్ తో గతంలో ‘జల్సా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే శృతి హాసన్ కూడా ‘గబ్బర్ సింగ్’ – ‘కాటమరాయుడు’ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేసుకుంటారన్న విషయం తేలక ముందే ..నాకొచ్చే ఛాన్స్ నువ్వు పట్టుకెళతావా అంటే నాకొచ్చిన ఛాన్స్ నువ్వు పట్టుకెళతావా అన్నట్టుగా ఇలియానా, శృతిహాసన్ ధోరణి కనిపిస్తుందట. కారణం ఇద్దరికి సినిమాలు లేవు. ఇద్దరు మళ్ళి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా వెలగాలని చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం కొట్టుకోకండి ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకుంటారులే అని అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news