తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. డిప్యూటీ CM భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాజీవ్ యువ వికాసం స్కీం కింద రూ.1000 కోట్లను జూన్ 2న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అచ్చంపేట సభలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క మాట్లాడుతూ..నేడు ప్రారంభించిన ఇందిరా జల వికాసం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. దానిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ప్రజలనుద్దేశించి భట్టి వ్యాఖ్యానించారు. అటు రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంప్ సెట్లు అందిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి దాదపు 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరు చేశారు రేవంత్ రెడ్డి.